A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ఉత్తర ఈశాన్యం లో మళ్లీ భూకంపం…

Posted by : TeluguMirchi on | May 12,2015

ఉత్తర ఈశాన్యం లో మళ్లీ భూకంపం…

నేపాల్ భూకంపం నుండి ఇంకా ప్రజలు తెరుకోకముందే..మరోసారి ఉత్తర, ఈశాన్య భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి. బెంగాల్, బీహార్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం 12.35 గంటలకు భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఏర్పడింది. ఇక ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గొల్లపూడి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు, విశాఖలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. స్వల్ప ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

Comments